విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్‌షిప్‌లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్‌షిప్‌లు

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

మద్దిలపాలెం: విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రోగ్రామ్‌–2026ను ఆదివారం మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్‌, బీటెక్‌ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్‌ చైర్మన్‌ ఆర్‌.వి.ఎస్‌.వి.బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్‌ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్యను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement