సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం తెలిపింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మెరిట్ ఆధారంగా 1.34 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.
ఆందోళనకు మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు


