అల్లూరు: ఆంధ్రప్రదేశ్ 12వ సీనియర్ సీ్త్ర, పురుషుల అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2026 పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఎస్‌ఏఏపీ అనుబంధం), నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో అల్లూరులోని రామకృష్ణ జూనియర్– డిగ్రీ కళాశాలల వేదికగా మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ట్రోఫీలు, జ్ఞాపికలు, అవార్డులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో విన్నర్స్‌గా ప్రకాశం, రన్నరప్‌గా విశాఖపట్నం, మహిళల విభాగంలో విన్నర్స్‌గా విశాఖపట్నం, రన్నరప్‌గా గుంటూరు నిలిచాయి. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.


