బీచ్‌రోడ్డు: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర’ అనే శ్లోకం స్ఫూర్తిగా ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులు అందుకున్న ఐదుగురు విశిష్ట గురువులను తెలుగు శక్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం మేఘాలయ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ బి. బ్రహ్మానందరావు, కె. ఫణి భూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ గురుపూజోత్సవాన్ని తెలుగు శక్తి నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలను సత్కరించారు. సోషల్ యాక్టివిస్ట్ పాలూరు శేషమాంబ, డాక్టర్ పపూర్ నికుంజ్, ఫిల్మ్ డైరెక్టర్, సోషల్ యాక్టివిస్ట్ వి. వంశీబాబు, బొల్లినేని వెంకటేశ్వరరావు, కె.రాజు పాల్గొన్నారు.


