పెందుర్తి: నేత్రదానంతో ఆయన కళ్లు సజీవంగా నిలవనున్నాయి. మృతుని కుటుంబ సభ్యుల ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మహాలక్ష్మినగర్ సమీపంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న దేశరాజు వెంకటరమణ(64) మంగళవారం ఉదయం బ్రెయిన్‌స్ట్రోక్‌తో మరణించారు. మృతుని సన్నిహితుడు ఉదయ్‌కుమార్ ద్వారా సమాచారం అందుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. మృతుని భార్య లక్ష్మి, కుమారుడు ప్రీతమ్‌కృష్ణ, కుమార్తె కాత్యాయిని వెంటనే అంగీకారం తెలపడంతో ఎల్వీ ప్రసాద్ మొహిసిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, వాణి మృతుని నేత్రాలను సేకరించారు.


