సింథియా: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కోసం హెచ్‌ఎస్‌ఎల్ నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బోలార్డ్ పుల్ టగ్ (వీసీ 11206)కు శుక్రవారం కీల్ లేయింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఐఆర్‌ఎస్, సోలాస్ మైరెన్ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ జస్మిత్ సింగ్ బింద్రా హాజరయ్యారు. ఈ టగ్‌ల నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయని, అక్టోబర్‌లో జంట టగ్‌లను జలప్రవేశం చేయనున్నట్లు హెచ్‌ఎస్‌ఎల్ అధికారులు తెలిపారు. ఇవి నౌకల సురక్షిత బెర్తింగ్, పోర్టు కార్యకలాపాల మెరుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామ్, ఐఆర్‌ఎస్, హెచ్‌ఎస్‌ఎల్ అధికారులు పాల్గొన్నారు.


