అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళాలు

Sep 5 2026 7:13 AM | Updated on Sep 5 2026 7:13 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి నగరంలోని షీలానగర్‌కు చెందిన సూరపనేని సుబ్రహ్మణ్యం శుక్రవారం రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం తరఫున పీఆర్‌వో కార్యాలయ సూపరింటెండెంట్‌ జోగారావు దాతకు బాండ్‌ అందజేశారు. అలాగే మహారాణిపేటకు చెందిన ఏతముక్కల చంద్రశేఖరరెడ్డి అన్నప్రసాద పథకానికి రూ.1,00,116, గో సంరక్షణ పథకానికి రూ.1,00,116 చొప్పున విరాళాలను చెక్కుల రూపంలో అందించారు. సంబంధిత చెక్కులను పీఆర్‌వో కార్యాలయంలో డిప్యూటీ ఈవో రాధకు అందజేశారు. దేవస్థానం తరఫున దాతలకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం, శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్‌వో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ వరాహనరసింహం, ముసలినాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement