డాబాగార్డెన్స్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం నుంచి ‘ఏరో ఎక్స్‌ప్రెస్’ పేరిట ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏఎస్‌ఆర్–1, ఏఎస్‌ఆర్–2 పేరిట రెండు మార్గాల్లో బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ రెండు మార్గాల్లోనూ ప్రతి అరగంటకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని, బస్సులు ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి అనుగుణంగా ఈ సర్వీసులను వినియోగించుకుని సౌకర్యవంతమైన ప్రయాణం పొందాలని అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.
ఏఎస్‌ఆర్–1 రూట్
గాజువాక, ఎన్‌ఏడీ, గురుద్వార్, జూపార్క్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఏర్పాటు జంక్షన్ మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ బస్సు నడుస్తుంది.
ప్రయాణ చార్జీలు: పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, ఎన్‌ఏడీ నుంచి రూ.350, గురుద్వార్ నుంచి రూ.300, జూపార్క్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఏర్పాటు జంక్షన్ నుంచి రూ.50.
ఏఎస్‌ఆర్–2 రూట్
గాజువాక, సింధియా, విశాఖ రైల్వేస్టేషన్, ద్వారకా బస్టేషన్, సిరిపురం,సాగర్‌నగర్ ఇస్కాన్ టెంపుల్,ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ బస్సు నడుస్తుంది.
ప్రయాణ చార్జీలు: పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, సింధియా నుంచి రూ.400, సిరిపురం నుంచి రూ.350, ఇస్కాన్ టెంపుల్ నుంచి రూ.300, ఐటీ హిల్స్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఏర్పాటు జంక్షన్ నుంచి రూ.50.


