విశాఖ వాసులకు ఈ విమానాశ్రయం చాలా అనువుగా ఉంటుంది. భోగాపురం అయితే సమయం, డబ్బు రెండూ ఎక్కువ ఖర్చవుతాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను. ప్రయాణానికి కొద్ది సమయం ముందే బయలుదేరాను. అదే భోగాపురం అయితే కనీసం రెండు గంటల ముందు బయలుదేరాలి. క్యాబ్ చార్జీలు, టికెట్ చార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. –ప్రసాదరెడ్డి ఇండియన్ ఆర్మీ
ఆ వ్యూ సూపర్
విశాఖ విమానాశ్రయంతో మంచి అనుబంధం ఉంది. విమానంలో వచ్చేటప్పుడు కనిపించే వ్యూ చాలా బాగుంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయం రావడం మంచిదే, కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండేలా దీన్ని కొనసాగించాలి. చివరిసారిగా ఈ విమానాశ్రయంలో దిగడం సంతోషంగా ఉంది. – శరత్, యూ ట్యూబర్


