పాపాహోమ్‌కు రూ.4 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

పాపాహోమ్‌కు రూ.4 లక్షల విరాళం

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

అల్లిపురం: రిజర్వ్‌ బ్యారెక్స్‌లో పబ్లిక్‌ అండ్‌ పోలీస్‌ అసోసియేషన్‌ ఫర్‌ స్ట్రీట్‌ చిల్డ్రన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాపాహోమ్‌కు రూ.4 లక్షల విరాళం అందించారు. దివంగత వంజరపు రామకృష్ణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబం తరఫున వి.మోహనరావు ఈ విరాళాన్ని అందజేశారు. బాలుర పాపాహోమ్‌కు రూ.2 లక్షలు, సీతమ్మధారలోని బాలికల పాపాహోమ్‌కు రూ.2 లక్షల చొప్పున చెక్కులను పాపాహోమ్‌ అధ్యక్షుడు డి.సూర్యప్రకాశరావు, కోశాధికారి రమేష్‌చంద్‌ జైన్‌లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పాపాహోమ్‌ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బాలబాలికల సంక్షేమం, విద్య, సంరక్షణకు దాతల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు భాస్కర్‌, శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement