డాబాగార్డెన్స్: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ మంగళవారం ప్రకటించిన అవార్డుల్లో సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్ పి.ఎల్.మోహన్‌రావుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో యుద్ధ హెలికాప్టర్ల విన్యాసాలను అద్భుతంగా చిత్రీకరించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 19న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. మోహన్‌రావు ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు.
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.36.28 లక్షలు


