ఐఎన్‌ఎస్‌ కళింగ కమాండర్‌గా కమోడోర్‌ సర్వదీప్‌ సింగ్‌ ధోడి | - | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ కళింగ కమాండర్‌గా కమోడోర్‌ సర్వదీప్‌ సింగ్‌ ధోడి

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

సింథియా: భీమునిపట్నం నేవల్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ కళింగ నూతన కమాండర్‌గా కమోడోర్‌ సర్వదీప్‌ సింగ్‌ ధోడి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఐఎన్‌ఎస్‌ కళింగలో నిర్వహించిన అధికారిక కమాండ్‌ మార్పిడి కార్యక్రమంలో కమోడోర్‌ అనిరుద్ధ రాయ్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1998 జూలై 1న ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో భారత నౌకాదళంలో చేరిన కమోడోర్‌ సర్వదీప్‌ సింగ్‌ ధోడి తన సుదీర్ఘ సేవాకాలంలో పలు కార్యాచరణ, శిక్షణ, సాంకేతిక విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఐఎన్‌ఎస్‌ కిర్చ్‌, ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్ర నౌకల్లో విస్తృతంగా సేవలందించారు. ముంబై, విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డుల్లోనూ పనిచేశారు. ఐఎన్‌ఎస్‌ వల్సురాలో ట్రైనింగ్‌ కెప్టెన్‌గా, ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో ఫ్లోటిల్లా కెప్టెన్‌గా, సీడీఎం సికింద్రాబాద్‌లో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ ఢిల్లీలో ఆర్‌ఎఫ్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీలు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement