విశాఖ–లీగల్: వచ్చేనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్మన్ చిన్నంశెట్టి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రాజీ కాగల కేసులను గుర్తించి, కక్షిదారులు, న్యాయవాదులతో చర్చలు జరపాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మంది న్యాయమూర్తులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. అలాగే 30 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం గురించి ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.


