వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార
ప్రతినిధి పాకా సత్యనారాయణ
అల్లిపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధిగా రెండోసారి నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పాకా సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మీసాల మనోహర్‌రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజీ నాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, లీగల్ సెల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సత్యనారాయణ తెలిపారు.


