జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. 29, 33, 34, 35 వార్డుల వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వరదు కల్యాణి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం నాయకురాలు వంగపండు ఉషారాణి, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానీకిరామ్, బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి, బిపిన్ కుమార్ జైన్ సంఘీభావం తెలిపారు.


