ఏయూలో శిఖండి రాజకీయం! | - | Sakshi
Sakshi News home page

ఏయూలో శిఖండి రాజకీయం!

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

క్యాంపస్‌లో ‘అధికార’ బంధువుల పెత్తనం శతాబ్ది వేడుకల వేళ వివాదాల ముసురు రాజకీయ కక్ష సాధింపులకు కేంద్రంగా వర్సిటీ పాలకవర్గంపై ఒత్తిళ్లు.. వర్సిటీ రూల్స్‌కు తూట్లు.. దిగజారుతున్న శతాబ్ది వర్సిటీ ప్రతిష్ట

క్యాంపస్‌లో ‘అధికార’ బంధువుల పెత్తనం శతాబ్ది వేడుకల వేళ వివాదాల ముసురు రాజకీయ కక్ష సాధింపులకు కేంద్రంగా వర్సిటీ పాలకవర్గంపై ఒత్తిళ్లు.. వర్సిటీ రూల్స్‌కు తూట్లు.. దిగజారుతున్న శతాబ్ది వర్సిటీ ప్రతిష్ట

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపులకు వేదికవుతోంది. వర్సిటీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని ప్రశ్నించిన వైస్‌ఛాన్సలర్‌ను టార్గెట్‌ చేయడం ఇపుడు ఏయూలో దుమారం రేపుతోంది. అధికారం ఉందన్న అహకారంతో ఏయూ పాలకవర్గంపై ఒత్తిడి చేస్తూ.. మాజీ వీసీపై చర్యలకు ఉపక్రమించడం వర్సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట!

ఇటీవల సస్పెన్షన్‌కు గురైన మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ప్రసాదరెడ్డి ఉదంతం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉండి, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువైన వ్యక్తిపై ఎన్నికల ప్రచార నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కలెక్టర్‌ స్థాయి చర్యలకు అప్పటి వీసీ సిఫార్సు చేశారు. ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని, అధికారంలోకి రాగానే సదరు ప్రజాప్రతినిధి కక్షగట్టి మరీ మాజీ వీసీ పదవీ విరమణ రోజునే ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయించారని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థలో ఎన్నడూ చూడని ఇటువంటి ప్రతీకార చర్యలు పునరావృతమైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రేరేపిత చర్యల వల్ల ఏయూ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలకు వేదిక కాదు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలు అందించి, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలా ఎదిగిన వారంతా ఏయూ వైభవాన్ని మరింత పెంచారే తప్ప, వర్సిటీ అంతర్గత పరిపాలనలో రాజకీయాలను చొప్పించలేదని విద్యార్థి సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. పాలకవర్గ అనుమతితో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి విశాఖ–2 నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన ఇంగ్లీష్‌ విభాగం ప్రొఫెసర్‌ పిన్నింటి వరలక్ష్మి, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై న హిందీ విభాగం ఆచార్యుడు పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ లాంటివారు ఏయూతో అనుబంధాన్ని కాపాడుకుంటూనే దానికి వన్నె తెచ్చారు. అలాగే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆచార్యుడు కుంభా రవిబాబు తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించగా, మేరుగ నాగార్జున కూడా ఏయూలో పనిచేసి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వీరంతా అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ వర్సిటీ యంత్రాంగంపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురాలేదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయని ఏయూ వర్గాలు వాపోతున్నాయి.

ఏయూ ప్రతిష్ట తీయకండి

ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలకు వేదికగా మార్చవద్దు. స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం సరికాదు. అసలు ఉన్నత విద్యామండలి ఉందో లేదో అర్థం కావడం లేదు. ఒక మాజీ వీసీని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడానికి ఆగమేఘాల మీద ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదు. రేపు అధికారం మారితే ఇదే తరహాలో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తే ఎలా?

– డాక్టర్‌ మీనన్‌, ఏయూ పూర్వ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement