తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని విశాఖపట్నం డివిజన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు గాను స్క్రాప్‌క్యూ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్బన్ ఫుట్‌ప్రింట్ సేవింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఈ సర్టిఫికెట్‌ను సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ తరఫున సంస్థ ప్రతినిధులు మంగళవారం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రాకు అందజేశారు. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు డివిజన్ 97,295 కిలోల వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరు చేసి రీసైక్లింగ్ చేయడం ద్వారా సుమారు 300.25 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆకై ్సడ్ ఉద్గారాలను తగ్గించింది. స్వచ్ఛ భారత్ మిషన్, మిషన్ లైఫ్, నెట్ జీరో–2070 లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ చర్యలను దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమర్థంగా అమలు చేస్తోందనడానికి ఈ గుర్తింపు నిదర్శనమని రైల్వే అధికారులు తెలిపారు.


