ముద్రగడకు వైఎస్సార్‌సీపీ నివాళి | - | Sakshi
Sakshi News home page

ముద్రగడకు వైఎస్సార్‌సీపీ నివాళి

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

మహారాణిపేట: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్‌సీపీ నాయకులు బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి పార్టీ, సీనియర్‌ నాయుకులు తాడి జగన్నాథరెడ్డి, జాన్‌ వెస్లీ, పేర్ల విజయ్‌చంద్ర, రవిరాజు, శ్రీదేవి వర్మ, సనపల రవీంద్ర భరత్‌, కర్రి రామిరెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, పీలా ప్రేమ్‌కిరణ్‌, బోని శివరామకృష్ణ, రెయ్యి వెంకటరమణ, ఆల్ఫా కృష్ణ, సుమన్‌ యాదవ్‌, బిపిఎన్‌ కుమార్‌ జైన్‌, దేముడు మాస్టర్‌, పులగం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement