మహారాణిపేట: విశాఖలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర సమాచార కమిషనర్ పి.ఎస్.నాయుడు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం అమలులో తీవ్ర లోపాలు గుర్తించి సంబంధిత అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లో లోపాలు సరిదిద్దాలని, లేనిపక్షంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20(2) ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మధురవాడ జెడ్సీ, సబ్ రిజిస్ట్రార్లకు
షోకాజ్ నోటీసులు
మధురవాడ: నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడుకు, సబ్ రిజిస్ట్రార్ చక్రపాణికి రాష్ట్ర సమాచార కమిషనర్ పీఎస్ నాయుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మధురవాడ జోనల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


