కొమ్మాది: బీచ్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఒక స్కూటీ దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. శివకుమార్ అనే వ్యక్తి తన స్కూటీపై ఆవుల మేత కోసం గడ్డిని తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో సైలెన్సర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు గడ్డికి వ్యాపించడంతో కొద్ది క్షణాల్లోనే స్కూటీ పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలను ముందే గమనించిన శివకుమార్, స్కూటీని రోడ్డుపైనే వదిలేయడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.


