నెలవారీ పన్నుల ఆదాయం వివరాలివి..
నెల 2024–25 2025–26
(రూ. కోట్లలో) (రూ. కోట్లలో)
ఏప్రిల్ 132.11 162.66
మే 18.84 25.47
జూన్ 25.66 32.05
జూలై 19.30 20.25
ఆగస్టు 16.90 20.30
సెప్టెంబర్ 18.96 25.41
అక్టోబర్ 15.08 18.55
నవంబర్ 28.21 29.12
డిసెంబర్ 40.55 73.12
జనవరి 18.02 18.05
ఫిబ్రవరి 32.31 35.99
మార్చి
(12 వరకు) 17.45 19.56
ఈ నెల 12 నాటికి రూ. 481 కోట్ల ఆదాయం
డాబాగార్డెన్స్: పన్నుల వసూళ్లలో జీవీఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నెల 12వ తేదీ నాటికి రూ.481.43 కోట్ల ఆదాయం వసూలైంది. జీవీఎంసీ పరిధిలో 6 లక్షలకు పైగా ఆస్తి, ఖాళీ స్థలాల అసెస్‌మెంట్లు ఉన్నాయి. గతేడాది (2024–25) మార్చి 12 నాటికి రూ. 383.39 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది అదే సమయానికి రికార్డు స్థాయిలో రూ.481.43 కోట్లు వసూలవ్వడం విశేషం. గతేడాది వసూళ్లతో పోల్చుకుంటే, ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 95.47 శాతం మేర వసూళ్లు పూర్తయ్యాయి.


