మహారాణిపేట : గృహ అవసరాలకు వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం కూడా నగరంలో మెరుపుదాడులు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్‌వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురు హోటళ్లు, రెస్టారెంట్లు గృహ వినియోగానికి ఉద్దేశించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 24 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యాపారులపై 6(ఏ) కేసులు నమోదు చేసినట్లు డీఎస్‌వో వి.భాస్కరరావు తెలిపారు.


