జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరమ్‌కు 12 వినతులు | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరమ్‌కు 12 వినతులు

Mar 7 2026 7:16 AM | Updated on Mar 7 2026 7:16 AM

అల్లిపురం: జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ ఓపెన్‌ ఫోరమ్‌లో 12 వినతులు స్వీకరించినట్లు కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎ. ప్రభాకరరావు, సీపిలు, డీసీపీలు, ఏసీపిలు పాల్గొన్నారు. మధురవాడ జోన్‌కు 2, ఈస్ట్‌ జోన్‌కు 4, నార్త్‌ జోన్‌కు 1, వెస్ట్‌ జోన్‌కు 1, పెందుర్తి జోన్‌కు 3, గాజువాక జోన్‌కు 1 వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే టౌన్‌ ప్లానింగ్‌ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఓపెన్‌ ఫోరమ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. అందిన వినతులపై అధికారులు వెంటనే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. అలాగే అడ్వర్టైజ్మెంట్‌ టాక్స్‌ వసూళ్లపై దృష్టి సారించాలని, ఎల్‌.ఆర్‌.ఎస్‌, బీపీఎస్‌ దరఖాస్తుల పరిశీలన చేసి మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement