గ్రహణం పట్టింది.. రోకలి నిలబడింది | - | Sakshi
Sakshi News home page

గ్రహణం పట్టింది.. రోకలి నిలబడింది

Mar 4 2026 7:17 AM | Updated on Mar 4 2026 7:17 AM

తగరపువలస: ఇది ఒక వైజ్ఞానిక అద్భుతమో లేక తరాల నాటి నమ్మకమో తెలీదు కానీ.. నేటికీ పల్లెల్లో గ్రహణ గడియలను లెక్కగట్టడానికి రోకలిని ఉపయోగిస్తున్నారు. సూర్య, చంద్ర గ్రహణాల సమయాల్లో గ్రామీణులు అనుసరించే ‘రోకలి సూత్రం’భీమిలి ప్రాంతంలో మరోసారి చర్చనీయాంశమైంది. జీవీఎంసీ భీమిలి జోన్‌ వలందపేటలో మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మహిళలు ఈ పద్ధతిని ప్రదర్శించారు. ఒక కంచు గిన్నెలో పాలు పోసి, అందులో రోకలిని నిలబెట్టి పూజలు చేశారు. గ్రహణం పట్టినంత సేపు ఆ రోకలి ఆధారం లేకుండా నిటారుగా నిలబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు మూడు గంటల పాటు అలాగే ఉన్న రోకలి, గ్రహణం వీడగానే దానంతట అదే పక్కకు వాలిపోయింది. దీన్ని బట్టే గ్రహణ పట్టు విడుపులను తాము గుర్తిస్తామని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement