రంగు రంగ వై భవంగా.. | - | Sakshi
Sakshi News home page

రంగు రంగ వై భవంగా..

Mar 4 2026 7:17 AM | Updated on Mar 4 2026 7:17 AM

ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

హోలీ సందర్భంగా విశాఖ సాగర తీరం రంగుల లోకమైంది. నగరం రంగుల హరివిల్లును తలపించింది. మంగళవారం ఉదయం నుంచే బీచ్‌ రోడ్డులోని కోకో ఎరీనా పరిసరాలు యువత కేరింతలతో మార్మోగాయి. చిన్నారులు, పెద్దలు, స్నేహితులతో కలిసి పరస్పరం రంగులు పూసుకుంటూసందడి చేశారు. కేవలం రంగులే కాదు.. ఆత్మీయ అనుబంధాలను కూడా పంచుకుంటూ హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల ఆట అనంతరం సముద్ర స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బుధవారం కూడా నగరంలో హోలీ సంబరాలు కొనసాగనున్నాయి. ప్రధాన హోటళ్లు, ఎంజీఎం పార్కులో రెయిన్‌ డ్యాన్స్‌లు, డీజే హంగామాతో భారీ ఈవెంట్లు జరగనున్నాయి.

– ఏయూ క్యాంపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement