అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే
వాసుపల్లి ఇళ్లలో వివాహ వేడుకలకు హాజరు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పర్యటన వివరాలిలా..
● ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
● ఉదయం 10.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● ఉదయం 11.40 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
● మధ్యాహ్నం 1.10 గంటలకు అరకు నుంచి హెలికాప్టర్‌లో తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
● మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు.
● మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు.


