ముగిసిన ఎన్‌ఎస్‌జీ విన్యాసాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎన్‌ఎస్‌జీ విన్యాసాలు

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

ముగిసిన ఎన్‌ఎస్‌జీ విన్యాసాలు

ముగిసిన ఎన్‌ఎస్‌జీ విన్యాసాలు

మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్‌’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్‌ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌ డాక్టర్‌ సుమిత్‌ గరుడ్‌ వెల్లడించారు. నక్సల్స్‌ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్‌, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement