కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.88.48 లక్షలు
డాబాగార్డెన్స్ : కనకమహాలక్ష్మి దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు గురువారం చేపట్టారు. గత నెల 8 నుంచి ఈ నెల 8 వరకు(31 రోజులు) హుండీల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.88,48,360 నగదు వచ్చింది. అలాగే 58 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, కేజీ 481 గ్రాముల వెండితో పాటు యూఎస్‌ఏకి చెందిన 16 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్‌కి చెందిన 700 బైసా, సౌదీ అరేబియన్ కరెన్సీ 50 రియాల్స్, బ్యాంక్ ఆఫ్ మలేషియా కరెన్సీ 1 రింగ్, 10 ఆర్‌ఎమ్స్, కెనడా కరెన్సీ 5 డాలర్లు, సింగపూర్ కరెన్సీ 10 డాలర్లు వచ్చాయి. లెక్కింపులో ఆలయ ఈవో కె.శోభారాణి, జిల్లా దేవదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదార్ శ్రీధర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


