బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: పార్టీ కమిటీల నిర్మాణాన్ని 45 రోజుల్లోగా పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆదేశించారు. వార్డులో ప్రతి ఒక్కరినీ కలుపుకొని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమావేశంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి నుంచి గ్రామ, వార్డు, అనుబంధ విభాగాల కమిటీలన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీలు, జిల్లా, వార్డు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటయ్యా యని, వాటిలో మిగిలిన పదవులతో పాటు గ్రామ, వార్డు అనుబంధ విభాగ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కదిరి బాబూరావు, రవిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే మండల, వార్డు స్థాయిలో కమిటీల నిర్మాణం జరిగిందన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి రెండు గ్రామాలకు ఇన్‌చార్జిలను, గ్రామ కమిటీలను, అనుబంధ విభాగ కమిటీలను నియమించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, మహిళా నేత సిరి సహస్ర, ఎస్‌ఈసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, డా. జహీర్ అహ్మద్, రాష్ట్ర పార్టీ అధికారిక ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయచందర్, ఇతర ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు


