12న శ్రీనృసింహ దీక్షల విరమణ
సింహాచలం: శ్రీనృసింహ దీక్షల విరమణ ఈనెల 12న సింహగిరిపై వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. 40 రోజుల మండల దీక్ష, 32 రోజుల దీక్ష చేసినవారంతా ఆరోజు దీక్షలు విరమించాలని పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటల నుంచి దీక్షాదారులను సుపధ మండపం మార్గం ద్వారా ప్రధాన ఆలయంలోకి అనుమతిస్తామని, స్వామివారి దర్శనం అనంతరం దక్షిణ రాజగోపురంలో నుంచి బయటకి పంపించడం జరుగుతుందన్నారు. శ్రీగోకులం వద్ద తిరుముడి సమర్పించాల్సి ఉంటుందన్నారు. గోకులం వద్ద తిరుముడులు సమర్పించేందుకు వీలుగా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుముడులతో దీక్షాదారులు క్యూల్లో వెళ్తూ వీక్షించే విధంగా కల్యాణమండపంలో శాంతి హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు.


