వచ్చే నెల 23న మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 23న మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు

Jan 9 2026 7:06 AM | Updated on Jan 9 2026 7:06 AM

వచ్చే నెల 23న మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు

వచ్చే నెల 23న మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు

బీచ్‌రోడ్డు : మిస్టర్‌ ఆంధ్ర బాడీ బిల్డింగ్‌ పోటీలు ఫిబ్రవరి 23న గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శివ వైజాగ్‌ బౌన్సర్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు బాడీ బిల్డింగ్‌ రంగానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని శివ వైజాగ్‌ బౌన్సర్‌ ఫౌండర్‌ శివ తెలిపారు. ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్‌ విన్యాసాలు ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement