ట్రూ అప్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రూ అప్‌

Jan 3 2026 8:11 AM | Updated on Jan 3 2026 8:11 AM

ట్రూ అప్‌

ట్రూ అప్‌

అండ్‌ డౌన్‌

దోపిడీ

కోసం..

ట్రూ అప్‌ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్‌

ఏపీఈఆర్‌సీ పరిశీలన

అనంతరం తేల్చిన లెక్కలు

● ట్రూఅప్‌ చార్జీలుగా

వసూలు చేయాల్సింది – 0

● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు,

రుణాలు, డిస్కౌంట్స్‌)

రూ.3,887.28 కోట్లు

● క్యారియింగ్‌ కాస్ట్‌

రూ.2,113.24 కోట్లు

● రిటైల్‌ సప్లయ్‌ టారిఫ్‌ వ్యయంపై

ట్రాన్స్‌మిషన్‌ లిమిటేషన్‌

రూ.6.49 కోట్లు

● మొత్తం ట్రూఅప్‌ నుంచి

తొలగించాల్సిన ఖర్చులు

రూ.6,007.01 కోట్లు

● 4వ కంట్రోల్‌ పీరియడ్‌లో వసూలు

చేయాల్సిన ట్రూఅప్‌ చార్జీలు

రూ.1,783.15 కోట్లు

● ప్రభుత్వమే భరించాలని చెప్పిన

ట్రూ అప్‌ చార్జీలు

రూ.1,783.15 కోట్లు

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలైన డిస్కమ్‌ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) బ్రేక్‌ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్‌) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్‌) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్‌ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్‌ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని తెగేసి చెప్పింది.

అంతా లోపభూయిష్ట లెక్కలు

ఏపీఈపీడీసీఎల్‌ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్‌సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్‌లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్‌’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్‌ విషయంలో ట్రూఅప్‌ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్‌ పేరుతో ఎందుకు క్లెయిమ్‌ చేసుకోవాలని ఈపీడీసీఎల్‌ భావించిందనే దానిపై ఈఆర్‌సీ మొట్టికాయలు వేసింది.

అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు?

ఈపీడీసీఎల్‌ చూపించిన గణాంకాలు

నాలుగో కంట్రోల్‌ పీరియడ్‌(సీపీ)లో

ట్రూ అప్‌ చార్జీలు

రూ.5,684.58 కోట్లు

క్యారియింగ్‌ కాస్ట్‌

రూ.2113.24 కోట్లు

మొత్తం రూ.7,797.82 కోట్లు

గతంలో ఈఆర్‌సీ ఇచ్చిన

ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి

రూ.7.65 కోట్లు

మొత్తంగా ట్రూఅప్‌ పేరుతో

ప్రజల నుంచి వసూలు

చేయాలనుకున్నది

రూ.7,790.16 కోట్లు

వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం!

ట్రూ అప్‌ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్‌సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్‌ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్‌సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్‌ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement