విద్యుత్ ఉగ్యోగుల సంక్షేమానికి కృషి
కొమ్మాది: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సాగర్‌నగర్‌లో గల ఏపీఈపీడీసీఎల్ సీవోఈఈటీ భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సంబంధిత అధికారులతో సమీక్ష ని ర్వహించారు. అనంతరం 34 మంది లబ్ధిదా రులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈపీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్న ఆర్‌డీఎస్‌ఎస్ పనులు పురోగతిని సమీక్షించిన ఆయన ఫేజ్–1 పనులు వేగవంతంగా పూర్తి చేసి, ఫేజ్–2కు వెళ్లేందుకు అధికారులు కృషి చేయా లని సూచించారు. కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణు కుమార్‌రాజు, సంస్థ డైరెక్టర్లు పివి సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు పాల్గొన్నారు.


