‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీమ్ సందడి
బీచ్‌రోడ్డు: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా యూనిట్ శనివారం నగరంలో సందడి చేసింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా రూపుదిద్దుతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా యూనిట్ విశాఖ వచ్చింది. ఈ సందర్భంగా నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుందని, విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ.. ఇందులో తాను ‘కొండవీటి ప్రశాంతి’ అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్ వ్యాన్ యజమాని ‘అంబటి ఓంకార్ నాయుడు’గా నటించినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత కథ ఆద్యంతం మలుపులు తిరుగుతుందని, భార్యాభర్తల మధ్య గొడవలను పందెంకోళ్ల పోరును తలపించేలా దర్శకుడు ఆసక్తికరంగా చూపించారని చెప్పారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, పక్కాగా ప్రేక్షకుల మనసు దోచుకునేలా ఉంటుందని దర్శకుడు ఏఆర్ సజీవ్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.


