ఆకట్టుకుంటున్న కళాసిల్క్ ప్రదర్శన
కరీంనగర్: అందం, హుందాతనం కలగలిపిన ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను విశాఖపట్నం వాసులకు చేరువ చేసేందుకు కళాసిల్క్ సంస్థ శ్రీకారం చుట్టింది. మురళీనగర్, లక్ష్మీగణపతి గుడి ఎదురుగా ఉన్న మాధవధార వుడా కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కళాసిల్క్ హస్తకళా ప్రదర్శన విశాఖవాసులను ఆకట్టుకుంటోంది. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడంతోపాటు చేనేత హస్తకళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు ఈ సంస్థ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశంలో ఎంపిక చేసిన చేనేత కళాకారులు అద్భుతంగా నేసిన సిల్క్, పట్టు, కాటన్ వస్త్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలాంకరి, ఉప్పాడ, అసోంలోని మూగా, ఎరిశిల్బ్, బిహార్‌లోని బాగల్పుర సిల్స్స్, టస్సర్, చత్తీస్‌గఢ్‌లోని ట్రిబిల్ వర్క్, కోసా సిల్క్, గుజరాత్‌లోని బాందని, కచ్చ ఎంబ్రయిడరీ డ్రెస్‌లు, శారీస్, జమ్మూ కాశ్మీర్‌లోని ఎండ్రాయిండరీ శారీస్, డ్రెస్ మెటీరియర్, పాస్మిక్ చేనేత వస్త్రాలతోపాటు హ్యాండీక్రాఫ్ట్స్, న్యూట్రీషన్ ఫుడ్, అతివల అలంకరణ వస్తువులు, హోంఫుడ్స్, బ్యాంగిల్స్‌ను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.


