
పింఛన్ ఇవ్వడం లేదు
నాకు 66 శాతంతో సదరం సర్టిఫికెట్ ఉంది. పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేశా. కాళ్లు,చేతులు సక్రమంగా పనిచేయవు. నాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. కుటుంబ పోషణ చాలా భారంగా ఉంది. – బత్తి హేమ, అశోక్‌నగర్, గాజువాక
రాళ్ల చెరువును కాపాడండి
మధురవాడలోని సర్వే నంబర్ 65/10లో 2.90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాళ్ల చెరువును కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఇది ‘ట్యాంక్ పోరంబోకు’గా నమోదైంది.గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా..కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

పింఛన్ ఇవ్వడం లేదు