
తప్పుడు పత్రాలతో భూ కబ్జా
తప్పుడు పత్రాలతో తన ఆస్తిని కబ్జా చేశారు. తగరపువలసలోని మెయిన్ రోడ్డులో ఉన్న తమ థియేటర్ స్థలాన్ని తనకు తెలియకుండా ఇతరులకు అప్పగించారు, సర్వే నంబర్ 47,1డి5లో ఉన్న 71 సెంట్ల స్థలం తన భర్త ద్వారా 1976లో అన్నదమ్ములకు దఖలు పడింది..దాన్ని ఉపయోగించి తాతా ఫిక్చర్ ప్యాలెస్ నిర్మించారు. తన భర్త, ఇతర భాగస్వాములు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి, తనకు ఎలాంటి సెటిల్‌మెంట్ ఇవ్వకుండా పార్టనర్‌షిప్ నుంచి తొలగించారు. తనకు అన్యాయం చేసిన రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ డీసీఆర్, భీమిలి జోనల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
– పరిమి లక్ష్మి, భీమిలి, తాతా థియేటర్ పార్టనర్