
సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
మహారాణిపేట: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జేసీ కె.మయూర్ అశోక్, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వి.మీనాక్షి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకర్ ప్రసాద్, డీఎల్‌ఓ డాక్టర్ ఆర్ రమేష్, ఎన్టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు, రీజనల్ ఐ హాస్పిటల్ ఆర్‌ఎంఓ డాక్టర్ నవీన్ కుమార్, ఆప్తాల్మిక్ ఆఫీసర్లు ఉమా శ్రీనివాస్, ఆర్.సురేష్ పాల్గొన్నారు.