
బాలుకి బళ్లారి రాఘవ జాతీయ పురస్కారం
పద్మనాభం: విజయనగరం జిల్లా, మద్ది గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు సామవేదం బాల సుబ్రహ్మణ్యం (బాలు) ప్రతిష్టాత్మకమైన బళ్లారి రాఘవ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి రాఘవ కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ తమ 53వ వార్షికోత్సవం సందర్భంగా అందించనుంది. బాల సుబ్రహ్మణ్యం వచ్చే నెల 6న బళ్లారిలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వృత్తిరీత్యా పురోహితుడైన బాల సుబ్రహ్మణ్యం రంగస్థల కళాకారుడిగా ‘పద్మ’ నాటకాల్లో అనేక ప్రదర్శనలిచ్చి బిరుదులు అందుకున్నారు. ఆయన ‘అనంత పద్మనాభ నాటక కళాకారుల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ‘తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్’ గౌరవ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ట్రస్ట్ ద్వారా ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతాల్లోని ఎందరో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులను ఆయన ప్రోత్సహించారు.