
యువకుడిని రక్షించిన అమనాం వాసులు
తగరపువలస: తగరపువలస–శ్రీకాకుళం జాతీయ రహదారి నుంచి భీమిలి మండలం అమనాం పంచాయతీకి వెళ్లే రహదారిలో ప్రవహిస్తున్న గెడ్డ నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని అమనాం గ్రామస్తులు సాహసం చేసి రక్షించారు. అమనాం రహదారిపై పొండుతున్న గెడ్డ మార్గంలో యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రవాహ వేగానికి కొట్టుకుపోతుండగా చూసిన అమనాం ప్రజలు రక్షించారు.
● ఆనందపురం మండలం పందలపాక పంచాయతీ పైలపేటలో డ్రైనేజీల నిర్మాణాల కోసం తవ్విన గోతుల వర్షంతో నిండి ఇళ్లలోకి ప్రవేశించడంతో సుమారు వంద కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడ్డారు.