
‘ఆహా ఏమి రుచులు’ రెస్టారెంట్‌పై దాడులు
85 కిలోల నిల్వ ఆహారం సీజ్ చేసిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలోని ‘ఆహా ఏమి రుచులు’రెస్టారెంట్‌పై ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 85 కిలోల నిల్వ ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. వీటిలో ప్రధానంగా చికెన్, చేపలు, రొయ్యలు, ఇతర మాంసం ఉత్పత్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.45,630 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిల్వ ఉంచిన ఈ ఆహారాన్ని వినియోగదారులకు అవసరమైనప్పుడు ఉపయోగించేందుకు రెస్టారెంట్ యాజమాన్యం సిద్ధంగా ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 85 రకాల ఆహార పదార్థాలను గుర్తించామన్నారు. వీటిలో కొన్ని శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడుల్లో స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.