
నేషనల్ సిల్క్ ఎక్స్‌పోలో 50 శాతం తగ్గింపు
అల్లిపురం: రాబోయే పండగలు, వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు గురువారం గ్రీన్ పార్క్ హోటల్‌లో ప్రారంభమయ్యాయి. ‘నేషనల్ సిల్క్ ఎక్స్‌పో’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి, దసరా, వివాహాది వేడుకలకు అవసరమైన సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ల సమ్మేళనంతో విభిన్న వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. వేలాది రకాల పట్టు, కాటన్ డిజైన్ వస్త్రాలు, డిజైనర్ చీరలు, బ్లౌజులు, కుర్తీలు మొదలైన వాటిని 50 శాతం వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్స్‌పో సందర్శకులకు అందుబాటులో ఉంటుందని, ప్రవేశం ఉచితమన్నారు. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని వివరించారు.