
ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్
డాబాగార్డెన్స్ : నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్) ‘క్షీ’ (శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నగరంలోని అన్ని జోన్‌లలో ‘ఈట్ రైట్ క్యాంపెయిన్’ ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరంలోని ప్రతి జోన్‌లో రెండు చొప్పున మొత్తం 16 ‘క్షీ’ బృందాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి వ్యాపారుల వద్ద ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై నిఘా ఉంచుతాయి. ఇప్పటివరకు 8 జోన్‌లలో 76 చోట్ల తనిఖీలు నిర్వహించి, 71 ఆహార విక్రయ కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 50 చోట్ల నుంచి రూ.68,600 అపరాధ రుసుం వసూలు చేశామన్నారు.