
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.46.53 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి హండీ ఆదాయం బుధవారం లెక్కించారు. జూన్ 11 నుంచి ఈ నెల 20 వరకు హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని లెక్కించారు. రూ.46,53,301 నగదు, 84.900 గ్రాముల బంగారం, 795 గ్రాముల వెండి వచ్చింది. యూఎస్‌ఏకి చెందిన 185 డాలర్లు, సింగపూర్‌కు చెందిన 10 డాలర్లు, యూఏఈకి చెందిన 10 దిర్హామ్స్, సౌదీ అరేబియాకు చెందిన 10 రియాల్, ఖతార్‌కు చెందిన 1 రియాల్, 110 న్యూజిలాండ్ దేశ డాలర్లు, ఉక్రెయ్‌ను దేవ 100 కరెన్సీ, శ్రీలంక దేశ రూ.20లు, థాయ్‌లాండ్ 70 బట్(కరెన్సీ) వచ్చింది. హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, దేవదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదార్ ఎం.శ్రీధర్, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు ఎన్.ఆనంద్‌కుమార్, కె.రాజేంద్రకుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మధుసూదన్, వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరి సేవ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.