ఫొటోగ్రాఫర్‌ అగర్వాల్‌కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ అగర్వాల్‌కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం

Aug 19 2025 6:40 AM | Updated on Aug 19 2025 6:40 AM

ఫొటోగ్రాఫర్‌ అగర్వాల్‌కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం

ఫొటోగ్రాఫర్‌ అగర్వాల్‌కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం

ఏయూక్యాంపస్‌: నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ బి.కె.అగర్వాల్‌కు అమెరికాకు చెందిన ఇమేజ్‌ కొలీగ్‌ సొసైటీ గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఫొటోగ్రఫీ రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని డిసెంబర్‌ 1న విజయవాడలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అగర్వాల్‌కు అందజేయనున్నారు. ఈ సందర్భంగా బి.కె.అగర్వాల్‌ మాట్లాడుతూ ఫొటోగ్రఫీలో తన ప్రతిభను గుర్తించడంపై, ఈ ప్రయాణంలో తనతోపాటు ప్రయాణించిన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం మరింత ప్రేరణ అందిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement