
త్వరలో ఏబీజీ పరీక్షలు
మహారాణిపేట: కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ఆర్జీ రియల్ బ్లడ్‌గ్లాస్(ఏబీజీ) పరీక్షలు నిలిచిన వ్యవహారంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్పందించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘రక్త ‘పరీక్ష’లే..!’శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో సూపరిండెంటెంట్ వాణి రేడియాలజీ, ల్యాబ్ టెస్టులు నిర్వహించే సిబ్బందితో సోమవారం సమావేశమయ్యారు. తక్షణం పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే స్థానికంగా కొనుగోలుచేసి ఏబీజీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.