
ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ మ్యూజియం
కై లాసగిరిపై త్రిశూలం
ఏర్పాటుకు శంకుస్థాపన
ఏయూ క్యాంపస్: విశాఖ నగరానికి వచ్చే సందర్శకులను మరింత అలరించేలా హెలికాప్టర్ మ్యూజియంను బీచ్‌రోడ్డులో అందుబాటులోకి తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు. దాదాపు రూ.3.5 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. భారత నావికాదళంలో విశేష సేవలు అందించి, విధుల నుంచి విరమణ పొందిన యుహెచ్3హెచ్ హెలికాప్టర్‌ను మ్యూజియంగా మార్పుచేసి, ప్రజల సందర్శనకు ఉంచారు. కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, వీఎంఆర్‌డీఏ కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్‌కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీశంకర్, మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.
కై లాసగిరిపై 55 అడుగుల త్రిశూలం
ఆరిలోవ: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై డమరుకంతో కూడిన త్రిశూలం ఏర్పాటుకు జల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ, హోంమంత్రి అనితలు సోమ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కై లాసగిరిపై రూ.1.55 కోట్లతో 55 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ మ్యూజియం