
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు వర్షం ఎఫెక్ట్
వచ్చిన అర్జీలు కేవలం 54
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నాటి పీజీఆర్‌ఎస్‌కు వర్షం ఎఫెక్ట్ కనిపించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు కేవలం 54 వినతులు మాత్రమే అందాయి. వీటిని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అన్ని జోనల్ కార్యాలయాల నుంచి వచ్చిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానివే 33 అర్జీలున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 3, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 9, మొక్కల విభాగానికి ఒక ఫిర్యాదు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు వెంటనే వాటిని పరిశీలించి, అర్జీదారులతో సంప్రదించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధాన ఇంజినీరు పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.