
సీఎం, ప్రతిపక్ష నాయకుల దృష్టికి ఈవోఐ అంశం
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం విస్తృతంగా విడుదల చేసిన ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)లు, తద్వారా జరగబోయే నష్టాలను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులను కలిసి వివరించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నిర్ణయించారు. స్థానిక గుర్తింపు యూనియన్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోరాట కమిటీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అమరావతికి వెళ్లి సీఎంను, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులను కలిసి సమస్యలను వివరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉక్కు మంత్రి, సహాయ మంత్రిని కలవాలని ప్రతిపాదించారు. ఈవోఐ అంశంపై నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే ఈ అంశంపై సమ్మెకు వెళ్లడానికి సమాయత్తం కావాలని కొంత మంది నాయకులు ప్రతిపాదించా రు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కె.ఎస్.ఎన్.రావు, జె.అయోధ్యరామ్, డి.వి.రమణారెడ్డి, జి.గణపతిరెడ్డి, జి.ఆర్.కె.నాయుడు, బి.డేవిడ్, వరసాల శ్రీనివాస్, నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.