హాఫ్‌ మారథాన్‌లో దాట్ల రామరాజు 3వ స్థానం | - | Sakshi
Sakshi News home page

హాఫ్‌ మారథాన్‌లో దాట్ల రామరాజు 3వ స్థానం

Aug 18 2025 6:27 AM | Updated on Aug 18 2025 6:27 AM

హాఫ్‌ మారథాన్‌లో దాట్ల రామరాజు 3వ స్థానం

హాఫ్‌ మారథాన్‌లో దాట్ల రామరాజు 3వ స్థానం

తాటిచెట్లపాలెం: బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో మౌంట్‌ అబూలో జరిగిన అంతర్జాతీయ హాఫ్‌ మారథాన్‌లో విశాఖకు చెందిన దాట్ల రామరాజు మూడో స్థానంలో నిలిచారు. వెటరన్‌ కేటగిరీలో 21 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 43 నిమిషాల్లో పూర్తిచేసి, విశాఖ కీర్తిని పెంచారు. విశ్వ సౌభ్రాతృత్వం సందేశాన్ని చాటడానికి నిర్వహించిన ఈ మారథాన్‌లో సుమారు 3,500 మంది జాతీయ, అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు గాను రామరాజు రూ. 51,000 బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ విజయం పట్ల బ్రహ్మకుమారీస్‌ రైల్వే న్యూ కాలనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement